Ghani: వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన.. ఆ పండుగకు రింగులో దిగుతున్న గని

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని టాలెంట్లను చూపించుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ ఆరంభం నుంచే సక్సెస్‌లను అందుకుంటోన్నాడు. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గని' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా వాయిదా పడినట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆ విషయాలు మీకోసం!

‘గని'గా మారిపోయిన మెగా ప్రిన్స్

‘గని'గా మారిపోయిన మెగా ప్రిన్స్

వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.

ఆటంకాలతో గని రిలీజ్‌కు బ్రేక్‌లు

ఆటంకాలతో గని రిలీజ్‌కు బ్రేక్‌లు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించింది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవడంతో విడుదలను వాయిదా వేసినట్లు ప్రకటించారు.

 షురూ చేసేశారు... వరుసగా వదిలి

షురూ చేసేశారు... వరుసగా వదిలి

వరుణ్ తేజ్ 'గని' సినిమాలోని నటీనటులకు సంబంధించిన పాత్రలు.. ఆయా ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా వదులుతూ వచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి హీరోతో పాటు నదియా, జగపతిబాబు, నవీన్ చంద్ర, సయీ మంజ్రేకర్‌, సునీల్ శెట్టి, ఉపేంద్రల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే, ఇటీవలే ఓ టైటిల్ సాంగ్‌ను కూడా వదిలారు.

 పుష్పరాజ్‌తో పోటీ పడాలని అలా

పుష్పరాజ్‌తో పోటీ పడాలని అలా

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'గని' మూవీని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. దానికి వారం రోజుల ముందే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ విడుదల ఉందని తెలిసినా.. కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యం చేసింది. దీంతో మెగా హీరోల వరుస సినిమాలతో ఫ్యాన్స్‌కు పండగే అని అంతా అనుకున్నారు.

మళ్లీ వాయిదా పడిన వరుణ్ గని

మళ్లీ వాయిదా పడిన వరుణ్ గని

బాక్సింగ్ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న 'గని' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాని నేపథ్యంలో దీన్నీ డిసెంబర్ 24న విడుదల చేయలేదు. దీంతో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటించిన గని మూవీని వచ్చే ఏడాది మార్చి 18న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ పండుగ రోజున రాబోతున్న గని

ఆ పండుగ రోజున రాబోతున్న గని

వరుణ్ తేజ్ నటించిన గని చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయబోతున్నారు. దీనికి కారణం అప్పుడు ఫెస్టివల్ వీకెండ్ కావడమే. 19న హోలీ పండుగ జరగబోతుంది. 20న ఆదివారం ఉంది. దీంతో వరుసగా మూడు రోజులు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ఆ రోజున దీన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X