Ghani: కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన గని టీమ్.. ఫ్యాన్స్‌కు వరుస పండుగలు
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి చాలా మంది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకుని స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఈ యంగ్ హీరో.. ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో పేరొందాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న వరుణ్ తేజ్.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
ఎన్నో విజయాలను అందుకుంటూ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా లేట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా మొదలెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు వచ్చాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మూవీ యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్ 24కు వాయిదా వేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేశారు. కానీ, ఆ తర్వాత ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని అన్నారు. అయితే, ఆరోజు 'భీమ్లా నాయక్' మూవీ విడుదల కావడంతో దీన్ని మళ్లీ వాయిదా వేసేశారు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది మూవీ యూనిట్. ఇందులో దీన్ని ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 2న ఉగాది పండుగ రాబోతుంది. ఆ తర్వాత శ్రీరామ నవమి కూడా ఉండనుంది. వీటితో పాటు ఫ్యాన్స్‌కు 'గని' విడుదల మరో పండుగ కాబోతుంది.

'గని'లో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











