Ghani Trailer: సొసైటీ అలాంటోడి మాటే నమ్ముతుంది.. లాస్ట్ షాట్ మాత్రం అదుర్స్
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదట్లో 'కంచె' వంటి ప్రయోగాత్మక చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత కూడా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా సక్సెస్‌లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ వరుస విజయాలతో సత్తా చాటుతున్నాడు. దీంతో ఇప్పుడు 'గని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
తన కెరీర్‌లో గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటించాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కింది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌ను కొద్ది రోజుల క్రితమే కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టి.. వాటిని కూడా శరవేగంగానే పూర్తి చేసేశారు.

బాక్సింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మూవీ యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్ 24కు వాయిదా వేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేశారు. కానీ, ఆ తర్వాత ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని అన్నారు. కానీ, అది కూడా కుదరకపోవడంతో ఏప్రిల్ 8వ తేదీని విడుదల చేయబోతున్నారు.
'గని' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రచార చిత్రాలను విడుదల చేయాలని భావించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో తన తల్లి కోసం బాక్సింగ్ ఆడడని అంటాడు. కానీ, ఆమెకు తెలియకుండా నేషనల్ చాంపియన్ అవ్వాలని అనుకుంటాడు. ఇంతలో ఆ నిజం తల్లికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్‌గా ఉంచారు. ఇక, ఈ ట్రైలర్‌లో విజువల్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా 'ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది' అనే డైలాగ్‌లు పేలాయి.
'గని' మూవీలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటించాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నదియా కూడా కీలక పాత్రలను చేశారు. దీనికి థమన్ సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











