మరో ప్రాజెక్ట్ మొదలెట్టిన మెగా హీరో.. కెరీర్‌లో తొలిసారిగా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో ప్రాజెక్టుకు ముహూర్తం కుదిరింది. ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాతో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్.. తన తర్వాతి సినిమాను అఫీషియల్ గా ప్రారంభించాడు.
వరుణ్ తేజ్ కెరీర్ లో 10వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఈ రోజు (గురువారం) ఫిలిం నగర్ టెంపుల్ లో లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కెరీర్‌లో తొలిసారిగా వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.
వరుస సినిమాలతో జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ ఈ మధ్య డిఫరెంట్ లుక్ లోకి మారడమే గాక, వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. దీంతో వరుణ్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రారంభించబడిన ఈ సినిమా కూడా వినూత్న కథాంశంతో తెరకెక్కనుందని అంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











