షాకింగ్ అప్‌డేట్: కారు ప్రమాదం జరిగిన వెంటనే వరుణ్ తేజ్..

Recommended Video

Narrow Escape For Actor Varun Tej In Car Incident || Filmibeat Telugu

రెండు రోజుల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయినప్పటికీ ఆయనకు మాత్రం గాయాలు కాకుండా బయటపడ్డారని తెలిసింది. ఇక ప్రమాదం జరిగిన గంట లోపే తన ఏమీ కాలేదని, మెగా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే ఆ కారు ప్రమాదం తర్వాత వరుణ్ ఎక్కడున్నాడు? ప్రస్తతం ఆయన ఏం చేస్తున్నాడు అనే కోణంలో సెర్చింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తాజా సినిమా డైరెక్టర్ వరుణ్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలేంటో చూద్దామా..

బుధవారం నాడు ప్రమాదం

బుధవారం నాడు ప్రమాదం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు బుధవారం నాడు ప్రమాదానికి గురైంది. . వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్తకోట మండలం రాయని పేట స్టేజీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అదృష్టవశాత్తు వరుణ్ తేజ్ కి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో మెగా అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

వరుణ్ ట్వీట్.. అభిమానుల కామెంట్స్

వరుణ్ ట్వీట్.. అభిమానుల కామెంట్స్

ప్రమాదం జరిగిన వెంటనే.. తను ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్‌కు గురైందని, కానీ అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరం క్షేమంగా బయటపడ్డామని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. తన యోగక్షేమాల గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. దీంతో ఆయన ట్వీట్ చూసి పెద్ద ఎత్తున రిప్లైలు పెడుతూ రియాక్ట్ అయ్యారు నెటిజన్లు.

ప్రమాదం జరిగిన మరుసటి రోజే..

ప్రమాదం జరిగిన మరుసటి రోజే..

ప్రమాదం జ‌రిగి ఒక్క రోజు కాకముందే షూటింగ్‌కు వెళ్లిపోయాడు వ‌రుణ్ తేజ్. యాగంటి స‌మీపంలో జరుగుతున్న వాల్మీకి సినిమా షూటింగ్ స్పాట్ లో ప్రత్యక్షమయ్యాడు వరుణ్ తేజ్. ఈ సెట్స్ పై ఈయన్ను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఆయన వాల్మీకి షూటింగ్ లో భాగమైపోయారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే ప్రమాదం నుంచి బయటపడ్డ వరుణ్.. తన సినిమా సెట్స్ పైకి వచ్చేశాడని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. ఈ మేరకు షూటింగ్ స్పాట్ లోని కొన్ని పిక్స్ షేర్ చేశాడు హరీష్ శంకర్.

వాల్మీకి మూవీ..

వాల్మీకి మూవీ..

తమిళనాట ఘన విజయం సాధించిన జిగర్తాండ సినిమాకు రీమేక్ గా వాల్మీకి సినిమా రూపొందుతోంది. 14 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యాగంటి షెడ్యూల్ లో వరుణ్ తేజ్‌తో పాటు బ్రహ్మాజీ, పూజా హెగ్డే, అధ‌ర్వ ముర‌ళి భాగమయ్యని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X