గద్దలకొండ గణేష్.. మెగా వారసుడు రంగం లోకి దిగుతున్నాడు.. ఇకపై ఆట షురూ!
గద్దలకొండ గణేష్ రూపంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగితున్నాడు. అది కూడా ఈ రోజు (సెప్టెంబర్ 9) నుంచే. అర్థం కాలేదా? అదేనండీ వాల్మీకి సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు గద్దలకొండ గణేష్ అని పేర్కొంటూ తనకు సంబందించిన ఓ లుక్ పోస్ట్ చేశాడు వరుణ్. ఈ మేరకు ఇవ్వాళ సాయంత్రం 4 గంటలకు చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నామని పేర్కొన్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకి సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Click it and Unblock the Notifications











