twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గద్దలకొండ గణేష్.. మెగా వారసుడు రంగం లోకి దిగుతున్నాడు.. ఇకపై ఆట షురూ!

    |

    గద్దలకొండ గణేష్ రూపంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగితున్నాడు. అది కూడా ఈ రోజు (సెప్టెంబర్ 9) నుంచే. అర్థం కాలేదా? అదేనండీ వాల్మీకి సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు గద్దలకొండ గణేష్ అని పేర్కొంటూ తనకు సంబందించిన ఓ లుక్ పోస్ట్ చేశాడు వరుణ్. ఈ మేరకు ఇవ్వాళ సాయంత్రం 4 గంటలకు చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నామని పేర్కొన్నాడు.

    హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకి సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Varun Tejs Valmiki Intresting Update
    ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా సెప్టెంబర్ 13వ తేదీనే విడుదల చేద్దామనుకున్న చిత్ర యూనిట్ నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా కోసం వాల్మీకిని వాయిదా వేసింది. చిత్రంలో వరుణ్ తేజ్ ఓ డిఫెరెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన సాంగ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

    English summary
    It looks like controversy is engulfing the title of Mega hero Varun Tej's latest movie "Valmiki". People who hail from the Boya community, from where the writer of Ramayana, Valmiki hails from, are said to have got upset with the usage of the sage's name as the title. Now Valmiki trailer release date fixed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X