‘వాల్మీకి’ రిలీజ్ డేట్ వాయిదా... ‘గ్యాంగ్ లీడర్’కు లైన్ క్లియర్
నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంగ్ లీడర్' ఆగస్టు 30న విడుదలవ్వాల్సి ఉండగా... 'సాహో' ఎఫెక్టుతో విడుదల వాయిదాపడిన సంగతి తెలిసిందే. దీన్ని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తేవాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు.
మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'వాల్మీకి' మూవీ సైతం చాలా రోజుల క్రితమే సెప్టెంబర్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 'గ్యాంగ్ లీడర్' కూడా అదే రోజుకు మారడంతో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయి, దీని వల్ల నష్టమే తప్ప లాభం లేదనే వాదన తెరపైకి వచ్చింది.

నిర్మాతల మధ్య జరిగిన చర్చల అనంతరం 'వాల్మీకి' చిత్రం విడుదలను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అఫీషియల్ పోస్టర్లు కూడా విడుదల చేశారు.
కాగా 'వాల్మీకి' టైటిల్ విషయంలో వివాదం కొనసాగుతోంది. వాల్మీకి కులస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా రూపొందించారని, సినిమా టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
'వాల్మీకి' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమిళ కల్ట్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'జిగర్తాండ' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. సిర్థార్థ్ పాత్రలో అథర్వ మురళి కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











