హైదరాబాద్ మెట్రో ట్రైన్.. ఎక్కడ చూసినా వాల్మీకి మాత్రమే.. వీడియో వైరల్
ఏ సినిమా అయినా విడుదలకు ముందు చేసే ప్రమోషన్స్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సినిమాను ఏ రేంజ్ ప్రమోట్ చేస్తున్నారనే దాని పైనే కలెక్షన్స్ సైతం ప్రభావితం చూపుతాయి. అందుకే చిత్ర ప్రమోషన్స్ విషయంలో సరికొత్త పద్ధతులకు స్వాగతం పలుకుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ కొత్త సినిమా వాల్మీకి చిత్రయూనిట్ ప్రమోషన్స్ పరంగా చాలా స్పీడ్‌గా ఉంది.
ఏకంగా మెట్రో రైల్ పైనే వాల్మీకి సినిమాను పరుగులు పెట్టిస్తున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం కూడా వాల్మీకి పోస్టర్‌లతో నిండి ఉండటం చూసి మురిసిపోతున్నారు మెగా అభిమానులు. మెట్రో పరుగులు పెట్టినట్లు గానే వాల్మీకి కూడా పరుగులు పెట్టేస్తుందని చెప్పుకుంటున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది 'వాల్మీకి' సినిమా. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications










