twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వాల్మీకి’ ప్రి టీజర్... షాకిస్తున్న వరుణ్ తేజ్ లుక్!

    |

    వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్మీకి' చిత్రానికి సంబంధించిన ప్రీ టీజర్ విడుదలైంది. దీని ద్వారా ఈ చిత్రంలో ఈ మెగా హీరో లుక్ ఎలా ఉండబోతోందో చూపించే ప్రయత్నం చేశారు. కెరీర్లో తొలిసారి వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

    గత చిత్రాల్లో హ్యాండ్సమ్ లుక్‌లో అభిమానులను అలరించిన వరుణ్ తేజ్... ఈ చిత్రంలో మాత్రం పూర్తి భిన్నంగా భారీ గడ్డంతో, విభిన్నమైన ఆహార్యంతో రౌడీలా కనిపించబోతున్నాడు. ప్రీ టీజర్ హీరో పాత్రపై మరింత ఆసక్తిని పెంచింది. ఇందులో హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

    Varun Tejs Valmiki Pre Teaser

    ప్రస్తుతం వాల్మీకి చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాకీ పార్ట్ యాభై శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    తమిళ కల్ట్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'జిగర్తాండ' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. సిర్థార్థ్ పాత్రలో అథర్వ మురళి కనిపించబోతున్నారు.

    'ఎఫ్ 2' విజయం తర్వాత వరుణ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగింది. అందుకు తగిన విధంగానే 'వాల్మీకి' చిత్రాన్ని 14 రీల్స్ ప్లాస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలోనిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    వరుణ్ తేజ్ రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా... డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 'వాల్మీకి'లో తనది కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ చేయడానికి ఒప్పుకున్నాడట.

    English summary
    Watch Varun Tej's Valmiki Pre Teaser. Directed by Harish Shankar. Music by Mickey J Meyer, DOP by Ayananka Bose, Editing by Chota K Prasad, Produced by Ram Achanta and Gopi Achanta On 14 Reels Plus Banner. The film is inspired from a Tamil blockbuster Jigarthandaa. 14 Reels Plus are the producers and Pooja Hegde, Atharvaa Murali are essaying other crucial roles in this action thriller.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X