క‌్రూరమైన లుక్‌లో మెగా హీరో.. రెండు రోజులు వేచి చూడండంటూ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో 'వాల్మీకి' ప్రీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. 'మరో రెండు రోజుల్లో మ్యాడ్‌నెస్ మొదలైపోతుంది. 'వాల్మీకి' టీజర్ కోసం వేచి చూస్తూ ఉండండి' అని అందులో పేర్కొన్నాడు. దీనితో పాటు ఓ రిలీజ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. అందులో వరుణ్ తేజ్ క‌్రూరమైన గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన వారంతా ఈ ఫొటో, ప్రీ టీజర్‌ను షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇవి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











