చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్.. వీడియో సాంగ్ రిలీజ్ చేసిన మెగా హీరో
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో బుధవారం 'వాల్మీకి' నుంచి 'జర్రా.. జర్రా' అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశాడు వరుణ్. యువతను ఉర్రూతలూగించేలా ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మాస్ బీట్‌కి తోడు.. వరుణ్ తేజ్ హైట్, వెయిట్ ప్రస్తావన తెస్తూ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ లిరికల్ సాంగ్. ఇక, ఈ వీడియో సాంగ్ ప్రోమోను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఈ ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయాతీ అనే హైదరాబాద్ అమ్మాయి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.


Click it and Unblock the Notifications











