పవన్ బర్త్ డేకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. మీతోనే ఉంటాం అంటూ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). దీనితో ఆయన 48వ పడిలోకి అడుగు పెట్టారు. దీనిని పురస్కరించుకుని 'వాల్మీకి' యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో వరుణ్ మాసీ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీనిపై 'హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్' అని రాశారు. అంతేకాదు, ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వరుణ్ తేజ్ 'హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్. ఎప్పటికీ మీతోనే ఉంటాం' అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ పోస్టర్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
అలాగే, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో ఫొటోను కూడా విడుదల చేసింది వాల్మీకి చిత్ర యూనిట్. ఇందులో పూజా హెగ్డే యాంటినా పట్టుకుని తిప్పుతుండగా, వరుణ్ గోడపై పడుకుని కనిపిస్తున్నాడు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











