Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
జబర్ధస్త్‌లోకి వరుణ్ తేజ్.. ఒక్కడే కాదు ఆయనతో కలిసి.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతుంది. ఇందులో భాగంగానే హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్ ప్రముఖ చానెల్లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' షోకు వెళ్లారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందట. ఇది.. పైయొచ్చే వారం అంటే సినిమా విడుదలకు ఒక రోజు ముందు ప్రసారం కానుందని సమాచారం. ఇదే షోలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు బడ్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ సినిమాలో డైరెక్టర్ సుకుమార్, హీరో నితిన్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలై సినిమా టీజర్, పాటలు అంచనాలను పెంచేశాయి. దీనికితోడు ఇందులో వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంటోంది.