విడుదలకు ముందే వాల్మీకి సెన్సేషన్.. సరికొత్త రికార్డు దిశగా పయనం.. ట్రెండింగ్‌లో టాప్

గద్దలకొండ గణేష్ రూపంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగితున్నాడు. తాజా సినిమా వాల్మీకిలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరిది. సెప్టెంబర్ 20 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

విభిన్న కథాంశాలు ఎంచుకుంటూ వెళ్తున్న వరుణ తేజ్.. వాల్మీకిలో గతంలో ఎన్నడూ చేయని డిఫెరెంట్ రోల్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో వరుణ్ క్యారెక్టర్, లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది ఈ ట్రైలర్. యూ ట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ ప్రస్తుతం ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

 Varun Tejs Valmiki Trailer Creating Sensation In Social media

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన వాల్మీకి సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X