వాల్మీకి ట్రైలర్: గద్దలకొండ గణేష్ అంటే గజ గజ వణకాలి.... పెర్ఫార్మెన్స్ ఇరగదీసిన వరుణ్ తేజ్

Recommended Video

Varun Tej's Valmiki Trailer

సినిమా సినిమాకు విభిన్నమైన కథ, లుక్ ట్రై చేస్తూ రోటీన్‌‌కు భిన్నంగా ముందుకు సాగుతున్న స్టార్ వరుణ్ తేజ్. తాజాగా ఈ మెగా ఫ్యామిలీ హీరో నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ట్రైలర్లోనే కథ చెప్పేశాడు

ట్రైలర్లోనే కథ చెప్పేశాడు

ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాదీ చూసే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి అనే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ఒక మంచి సినిమా తీస్తా... ఫాంహౌస్‌లో ఉన్న డాన్‌ను కాదురా, ఫాంలో ఉన్న డాన్‌ను మన సినిమా కోసం వెతికి పట్టుకోవాలి అంటూ ముందు అథర్వ ఎంట్రీ ఇచ్చారు. దీన్ని బట్టి గద్దలకొండ గణేష్ అనే డాన్‌తో సినిమా తీసే ప్రయత్నమే ‘వాల్మీకి' అని స్పష్టమవుతోంది.

పెర్ఫార్మెన్స్ ఇరగదీసిన వరుణ్ తేజ్

గద్దలకొండ గణేష్... నా పైన పందాలేస్తే గెలుస్తరు, నాతో పందాలు వేస్తే చస్తారు... మనం బ్రతుకుతున్నామని పది మందికి తెలియకపోతే ఇక బ్రతుకుడు ఎందుకురా? ఉత్తగీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు, గద్దల కొండ గణేష్ అంటే గజ గజ గజ వణకాలి అనే డైలాగులతో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ఇరగదీశారు.

లవ్ ట్రాక్

లవ్ ట్రాక్

గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీ లహరి పాట కొట్టుడు, నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేమ్ టు సేమ్.. అంటూ పూజా హెగ్డే, వరుణ్ తేజ్ మధ్య జరిగే లవ్ ట్రాక్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.

వాల్మీకి టైటిల్ ఎందుకు పెట్టారంటే...

వాల్మీకి టైటిల్ ఎందుకు పెట్టారంటే...

వాల్మీకి... ఒక మామూలు మనిషి మహారుషిగా మారి రామాయణం రాశారు. అందుకే మన సినిమా టైటిల్ వాల్మీకి అని టైటిల్ అనుకుంటున్నామని అధర్వ చెప్పే డైలాగ్ ద్వారా... ఈ మూవీపై ఉన్న వివాదంపై వివరణ ఇచ్చారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్ర‌ఫీ: ఐనాంక బోస్
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటింగ్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపి ఆచంట‌
స్క్రీన్ ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, మిథున్ చైత‌న్య‌
ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌.ఎస్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X