twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్ సినిమా ఫస్ట్ లుక్: ఉత్కంఠ పెంచేలా టైటిల్.. 'అంతరిక్షం 9000 కెఎమ్‌పి‌హెచ్'!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తాజగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్పేస్ సైన్స్ నేపథ్యంలో థ్రిల్లర్ గా రూపొందుతోంది. అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఘాజి తరువాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగష్టు 15 సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేశారు. టైటిల్ ఉత్కంఠ పెంచే విధంగా ఉంది. వరుణ్ తేజ్ వ్యోమగామి గెటప్ లో అంతరిక్షంలో కనిపిస్తున్నాడు.

    అంతరిక్షం

    అంతరిక్షం

    వరుణ్, సంకల్ప్ రెడ్డి సినిమా టైటిల్ అంతరిక్షం. 9000 కెఎమ్‌పి‌హెచ్ అనే క్యాప్షన్ కూడా ఉంది. పూర్తి గా స్పేస్ సైన్స్ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఘాజి తరహా విభిన్న చిత్రానికి ఆడియన్స్ జై కొట్టడంతో సంకల్ప్ మరో ప్రయోగం చేయబోతున్నాడు.

    వ్యోమగామిగా

    వ్యోమగామిగా

    ఫస్ట్ లోక్ లో వరుణ్ తేజ్ వ్యోమగామి గెటప్ లో కనిపిస్తున్నాడు. అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్ కు వేలాడుతూ కనిపిస్తున్నాడు. విభిన్న చిత్రాలు కోరుకునే వారు తొలి రోజే ఈ చిత్రానికి పరుగులు పెట్టడం ఖాయం.

    విడుదల తేదీ ఖరారు

    విడుదల తేదీ ఖరారు

    ఇదే సందర్భంలో చిత్ర యూనిట్ విడుదల తేదీ కూడా ఖరారు చేసింది. డిసెంబర్ 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున అదితి రావు పాత్ర కూడా వ్యోమగామే. ఘజితో మ్యాజిక్ చేసిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

    హాలీవుడ్ స్థాయిలో

    హాలీవుడ్ స్థాయిలో

    ఈ చిత్రంలో వరుణ్ తేజ్ అంతరిక్ష వాతావరణంలో చేసే స్టంట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని సమాచారం. ప్రారంభంలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది.

    English summary
    Varun Tej, Sankalp reddy space movie title and first look released. Varun Tej Stunning look as astronaut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X