నిహారిక పెళ్లి బాధ్యత మొత్తం వరుణ్ తేజ్ చేతిలోనే.. ఖర్చులతో పాటు ఆ నిర్ణయాలు కూడా

ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక పెళ్లి అనేది అంత ఈజీగా ఫినిష్ చేసేది కాదు. మంచి చెడులను దగ్గరండి చూసుకోవాలి. ఇక పెళ్లికి ముందు వేసుకునే ప్లాన్స్ ఈజిగానే ఉంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టాలంటే చాలా ప్రెజర్ తో కూడుకున్న పని. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులన్నిటిని కూడా వరుణ్ తేజ్ తన నెత్తిపైనే వేసుకున్నాడట. ఖర్చుల నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయం వరకు వరుణ్ తేజ్ తోనే నిర్ణయం మొదలవుతోందని తెలుస్తోంది.

పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత..

పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత..

నిహారిక పెళ్లిపై గత కొన్ని వారాలుగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ అయిపోయినప్పటి నుంచి కూడా పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తోంది. కరోనా టైమ్ లో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఇక డిసెంబర్ లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు.

అప్పటి వరకు షూటింగ్ లకు బ్రేక్

అప్పటి వరకు షూటింగ్ లకు బ్రేక్

ఇక ఇటీవల షూటింగ్ లకు ఎండ్ కార్డ్ పెట్టిన వరుణ్ తేజ్ చెల్లి పెళ్లి ఎండ్ అయ్యే వరకు వేరే పనులు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి విషయంలో నాన్న కంటే ముందే అన్ని బాధ్యతలను తనపై వేసుకున్నాడట. ఖర్చుల నుంచి మొదలుకొని పెళ్లి పనులు ఎలా జరగాలనే విషయంలో పూర్తిగా తన నిర్ణయాలను తల్లి దండ్రుల ముందు ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లితోనే వరుణ్ తన ఆలోచనలను ఎక్కువగా పంచుకుంటూ తుది నిర్ణయాన్ని నాన్న నాగబాబుతో చెబుతున్నాడట.

లొకేషన్స్ కోసం వరుణ్ సెర్చింగ్..

లొకేషన్స్ కోసం వరుణ్ సెర్చింగ్..

ఇక పెళ్లి ఎక్కడ చేయాలనే విషయంలో రీసెర్చ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే చేయాలని ఇరు కుటుంబ సభ్యులు ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీ ముందు ఉంచారట. ముఖ్యంగా ఇంటికి పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వరుణ్ లొకేషన్స్ లో ఉండే సౌకర్యాల గురించి కూడా ఒక లిస్ట్ రెడీ చేసి ఆయన ముందు ఉంచబోతున్నారట.

ఖర్చు విషయంలో కూడా..

ఖర్చు విషయంలో కూడా..

ఫైనల్ గా అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే పెళ్లికి సంబంధించిన అసలు పనులను స్టార్ట్ చేయాలని వరుణ్ తేజ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఖర్చు విషయంలో వరుణ్ తేజ్ ఏ మాత్రం వెనుకాడదని అనుకున్నాడట. నాగబాబు కంటే కూడా వరుణ్ ఆదాయం ఎక్కువే. సినిమాకు 8కోట్లకు పైగానే తీసుకున్నట్లు గత ఏడాది ఒక బలమైన టాక్ వచ్చింది. దీంతో ఒక్కగానొక్క చెల్లి పెళ్లి విషయంలో మెగా హీరో ఏ మాత్రం తగ్గడని అనిపిస్తోంది.

Recommended Video

Niharika, Nagababu Funny Conversation With Amaram Akhilm Prema Movie Team
పెళ్లి డేట్ ఇంకా ఫైనల్ కాలేదు

పెళ్లి డేట్ ఇంకా ఫైనల్ కాలేదు

ఇక పెళ్లిని డిసెంబర్ లో ఎలాగైనా నిర్వహించాలని ఒక ఆలోచనతో ఉన్నట్లు గతంలోనే ఇంటర్వ్యూలో చెప్పిన నాగబాబు ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. లొకేషన్స్ కూడా ఆల్ మోస్ట్ రెడీ అయ్యాయి. మళ్ళీ ఒకరోజు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ముహుర్తాలు సెట్ చేసుకోవాలని చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X