Ind vs pak: దుబాయ్ స్టేడియంలో తండ్రితో మెగా హీరో.. చివరికి అప్సెట్.. అల్లు అర్జున్ కూడా..

కొంత మంది సినీ తారలు క్రికెట్ ను ఎంతగా ఎంతో ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మరి కొందరు మాత్రం ఏకంగా క్రికెట్ స్టేడియంకి వెళ్లి మరి మ్యాచ్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం మెగా హీరో తన తండ్రితో కలిసి దుబాయికి వెళ్ళగా అల్లు ఫ్యామిలీ మాత్రం ఇంట్లో ప్రత్యేకంగా మ్యాచ్ ను వీక్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మొదట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసిన వీరు చివరికి అప్సెట్ అయ్యారు.

తప్పకుండా గెలుస్తుందని అనుకుంటే..

తప్పకుండా గెలుస్తుందని అనుకుంటే..

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది క్రికెట్ అభిమానులు ఎదురు చూసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం తలపడిన ఈ రెండు జట్లలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఇండియా తప్పకుండా గెలుస్తుంది అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అంతేకాకుండా గట్టిపోటీ ఇస్తుందని కూడా అనుకున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్ ను పూర్తి చేసింది.

దుబాయ్ లో వరుణ్ తేజ్

దుబాయ్ లో వరుణ్ తేజ్

క్రికెట్ అంటే ఎంతగానో ఇష్టపడే మెగా హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. అతను స్కూల్ దశలో ఉన్నప్పుడు రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ వచ్చాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆటకు కాస్త దూరమైనప్పటికీ అప్పుడప్పుడు మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం రోజు ప్రత్యేకంగా దుబాయ్ కి కూడా వెళ్ళాడు. తన తండ్రి నాగబాబు తో కలిసి మ్యాచ్ చూస్తున్నట్లు ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

నిరాశతో వరుణ్ తేజ్ పోస్ట్

నిరాశతో వరుణ్ తేజ్ పోస్ట్

దుబాయ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎనర్జీగా సాగుతోంది అంటూ ప్రత్యేకంగా తండ్రి తో దిగిన ఫోటోలు షేర్ చేసుకున్న వరుణ్ తేజ్ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం గుడ్ నైట్ అంటూ బాధగా మరొక ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశాడు. మొత్తానికి పాకిస్థాన్ తో భారతజట్టు ఓడిపోవడం అందరి అభిమానులను ఎంతగానో కలిచివేసింది. ఇక వరుణ్ తేజ్ కూడా ఎంతో హ్యాపీగా చూడాలనుకుని వెళ్లగా చివరికి నిరాశ తోనే గుడ్ నైట్ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక వరుణ్ తేజ్ నెక్స్ట్ గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
అల్లు ఫ్యామిలీ అలా..

అల్లు ఫ్యామిలీ అలా..

ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ కనిపించారు. అల్లు అర్జున్ తన కూతురు అర్హ అలాగే తనయుడు అయాన్ తో కలిసి ఇంట్లోనే ప్రత్యక్షంగా వీక్షించారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు. అల్లు అర్జున్ కూడా క్రికెట్ ఆటను ఎంతగానో ఇష్టపడతాడు. అయితే ఇండియా ఓడిపోవడంతో మన స్టార్ హీరోలు ఎవరు కూడా సోషల్ మీడియాలో పెద్దగా స్పందించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X