నితిన్ ఆ విషయంలో మోసం చేశాడు.. అతనే నంబర్ వన్ ఫ్యాన్.. వరుణ్ సెన్సేషనల్ కామెంట్..
యంగ్ హీరో నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భీష్మ. మాస్ అంశాలతో, ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన భీష్మ.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లిపోతోంది. మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన వసూళ్ల సునామిని సృష్టిస్తోంది. నితిన్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా భీష్మ నిలిచింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ వైజాగ్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్ హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో వరుణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

ఇక్కడి గాలి, నీరు వంట పట్టింది..
వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత వారమే వైజాగ్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించాడు వరుణ్. అయితే ఈ ఈవెంట్ వైజాగ్‌లో జరగడంతో చీఫ్ గెస్ట్‌గా విచ్చేశాడు. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. పది రోజుల నుంచీ తన సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వైజాగ్ లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక్కడి గాలి, అవీ వంటపట్టాయని, తానిక్కడకు ఒక చీఫ్ గెస్టులా కాకుండా తన ఫ్రెండ్ నితిన్ సక్సెస్‌ను ఎంజాయ్ చెయ్యడానికి వచ్చానని తెలిపాడు.

సినిమా స్టోరీ ముందే తెలుసు..
ఈ సినిమా స్టార్ట్ చెయ్యక ముందు నుంచీ, ఒకటిన్నర సంవత్సరంగా నితిన్, తాను కలిసి ట్రావెల్ చేశామని అన్నాడు. ఈ సినిమా స్టోరీ తనకు ముందే చెప్పాడని, సాంగ్స్ ముందే చూపించాడని తెలిపాడు. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకున్నానని, నిజంగా తన సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో.. దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యానని పేర్కొన్నాడు.

ఆ విషయంలో మోసం చేశాడు..
నితిన్ సినిమానంతా జెన్యూన్‌గా తీశాడని, ఒక విషయంలో మోసం చేశాడని అన్నాడు. 'భీష్మ.. సింగిల్ ఫరెవర్' అన్నాడని, ఫస్ట్ రీల్ అయ్యేవరకు అమ్మాయిని పడేశాడని తెలిపాడు. సింగిల్‌గా ఉంటానని చెప్పి, సినిమా విడుదలకు ముందు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడన్నాడు. మమ్మల్ని మోసం చేశాడని తెలిపాడు. ఏదేమైనా అతని విషయంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని పేర్కొన్నాడ. ఈ సినిమా సక్సెస్ కంటే పెద్ద అడుగు పెళ్లి చేసుకోవడమని, అతనికీ, శాలినికీ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలను తెలిపాడు.

అతనే నంబర వన్..
తాను చిన్నప్పట్నుంచీ కల్యాణ్ బాబాయ్ ఇంట్లో పెరిగానని తెలిపాడు. రక్త సంబంధం కాబట్టి తాను ఆయనకు అభిమానినవడం పెద్ద విషయం కాదని, కానీ తాను రేటింగ్ ఇస్తున్నానని.. నితిన్ నంబర్ వన్ పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా నితిన్‌కు కల్యాణ్ బాబాయ్ అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











