Varun Tej: హై రేంజ్ యాక్షన్ గాండీవధారి టీజర్.. లక్షల కోట్ల బిజినెస్‌తో ఇంట్రెస్టింగ్‌గా!

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మందే కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. నాగబాబు కుమారుడిగా ఎంటరైన అతడు.. ఆరంభం నుంచే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దీనికితోడు ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతోన్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం చూస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు 'గాండీవధారి అర్జున' అనే మూవీ చేస్తున్నాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా.. క్రేజీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తోన్న చిత్రమే 'గాండీవధారి అర్జున'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. మిగిలిన చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను అనుకున్న సమయానికే తీసుకు రావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలను సైతం మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది.

Varun Tej Starrer Gandeevadhari Arjuna Movie Teaser Released

అదిరిపోయే యాక్షన్‌తో రూపొందుతోన్న 'గాండీవధారి అర్జున' మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో ఓ మిషన్ కోసం ఏజెంట్ అయిన హీరోను రంగంలోకి దింపుతున్నట్లుగా చూపించారు. అతడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మిషన్ ఎలా నడిచింది అనే కాన్సెప్టుతో దీన్ని కట్ చేశారు. ఇక, ఈ టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు హై రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. దీనికితోడు వరుణ్ లుక్స్, గ్రాండ్ విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ టీజర్‌లో లక్షల కోట్లు బిజినెస్ అంటూ చెప్పి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'గాండీవధారి అర్జున' మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. అలాగే, నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X