Gandeevadhari Arjuna Trailer: అతిపెద్ద క్యాన్సర్ మనిషి.. హాలీవుడ్ స్థాయిలో వరుణ్ తేజ్ మూవీ
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. బాలనటుడిగా సినిమాలు మొదలు పెట్టిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత విభిన్నాత్మక సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలతో ఫ్లాపులు చూస్తున్న వరుణ్ తేజ్ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే త్వరలోనే 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా గాండీవధారి అర్జున ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గాండీవధారి అర్జున. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సత్తారు చివరిగా నాగార్జున ది ఘోస్ట్ మూవీ తెరకెక్కించారు. అది బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గని కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ ఇద్దరు ఎలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే గాండీవధారి అర్జున. ఇందులో హీరోయిన్ గా మరో ప్లాప్ మూవీ అయిన ఏజెంట్ బ్యూటి సాక్షి వైద్య చేస్తోంది.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గాండీవధారి అర్జునను ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇదివరకు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా గాండీవధారి అర్జున ట్రైలర్ (Gandeevadhari Arjuna Trailer) రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ హాలీవుడ్ స్థాయిలో అదిరిపోయింది. డిసెంబర్ 2022లో దేవుడిపై మనిషి గెలిచాడు అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఏజెన్సీలో చాలా మంది ఉన్నారు. కానీ, క్లయింట్ కోసం బుల్లెట్ తీసుకునేది అర్జున్ మాత్రమే, తప్పు చేస్తే నా క్లయింట్ ను నేను చంపేస్తా, నిజం ఈ ప్రపంచానికి తెలియాలి, భూమి మీద అతిపెద్ద క్యాన్సర్ మనిషేనేమో అంటూ చెప్పిన డైలాగ్స్ క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి.
మొత్తానికి గాండీవధారి అర్జున సినిమా మెడికల్ మాఫియా కథాంశంగా సాగినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతోపాటు స్టైలిష్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సలను ఇంతకుముందు విడుదలైన ప్రీ టీజర్ తో హింట్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











