Who is Ratan Khatri? ఇండియాను గడగడలాడించిన గ్యాంబ్లర్‌తో Matka , ఎవరీ మట్కా కింగ్?
ప్రేమకథలు, హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ , సోషియో ఫాంటసీ సినిమాలు తీసి తీసి బోర్ కొట్టిందో ఏమో కానీ మేకర్స్ వాస్తవిక సంఘటనలు , బయోపిక్స్, రియల్ స్టోరీస్, పీరియాడికల్ డ్రామాలు రూపొందిస్తున్నారు. అఫ్‌కోర్స్ జనం కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. క్రైమ్ వరల్డ్‌లో డాన్‌లుగా వెలుగొందిన వారి జీవిత కథలు సినిమాలుగా వస్తున్నాయి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా సైతం ఓ నేర సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తి కథగా తెలుస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
పలాస 1978, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం వంటి వెరైటీ సినిమాలు తీసి టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన మూవీయే మట్కా. కరుణ కుమార్ సినిమా అంటే ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుందని ప్రేక్షకుల మైండ్‌లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలోనే మట్కాలోనూ ఆయన ఏదో ఒక స్పెషాలిటీ చూపించడానికి ట్రై చేశారంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా మట్కాను నిర్మించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, సలోని, రవిశంకర్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, వరుణ్ తేజ్ గెటప్, లుక్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
1958-82 సంవత్సరాల మధ్య దాదాపు 25 పాతికేళ్ల పాటు విశాఖపట్నంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా మట్కాను తెరకెక్కిస్తున్నారు కరుణ కుమార్. ఆ ఏరియాలో మట్కా గ్యాంబ్లర్‌గా పోలీసులకు, ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసిన వాసు అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా మట్కాను తెరకెక్కించారు కరుణ కుమార్. అయితే ఇది వాసు కథ కాదని.. 1960వ దశకంలో భారతదేశాన్ని గడగడలాడించిన మట్కా కింగ్ రతన్ ఖత్రీ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అవిభక్త భారతదేశంలోని కరాచీలో (ప్రస్తుతం పాకిస్తాన్) జన్మించిన రతన్ .. దేశ విభజన అనంతరం ముంబైకి వలస వచ్చాడు. 1962లో బొంబే కేంద్రంగా మట్కా గ్లాంబ్లింగ్ ప్రారంభించిన అతను తన నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాడు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వంటి మాధ్యమాలు లేని ఆకాలంలో బెట్టింగ్ సామ్రాజ్యాన్ని నడపటమంటే మామూలు విషయం కాదు. మట్కాలో కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టి కోట్లకు పడగలెత్తాడు. భారత్‌లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన సమయంలో రతన్ ఖత్రీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాదాపు 20 నెలల పాటు జైల్లో ఉన్న ఖత్రీ తర్వాత విడుదలయ్యాడు. 2020లో రతన్ కన్నుమూశారు. క్రైమ్, థ్రిల్లర్ సినిమాను తలపించే ఇతని జీవితం గురించి నేటికీ ముంబై వీధుల్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. మరి మట్కాలో చూపించింది రతన్ ఖత్రీ గురించా? లేక వైజాగ్ వాసు? గురించా అన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











