For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  VT13: మిస్ వరల్డ్‌తో వరుణ్ తేజ్ రొమాన్స్.. ముంబైలో జంటగా హల్చల్

  |

  మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడన్న విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ కుర్రాడు.. స్టార్‌గా ఎదుగుతున్నాడు. దీంతో వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, కొంత కాలంగా కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. అయితే, అతడు నటించిన 'గని' ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ అతడు ఫుల్ జోష్‌తో ముందుకు వెళ్తోన్నాడు.

  Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. అతడు సేఫ్ అవడంతో వాళ్లకు షాక్.. డేంజర్‌ జోన్‌లో ఎవరంటే!

  ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది. ఇప్పుడు లండన్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, తన 13వ సినిమాను కూడా వరుణ్ ఇప్పటికే ప్రకటించాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందిస్తున్నాడు. ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ రాబోతుంది. అంతేకాదు, భారత వైమానిక దళానికి చెందిన అభినందన్ వర్థమాన్ కథతో ఇది తెరకెక్కుతోందని తెలిసింది.

   Varun Tej to Romance with Manushi Chhillar in VT13

  ఇక, ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడీగా నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న మూవీ కావడంతో హిందీ నటినే తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కోసం 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను తీసుకున్నారని తెలిసింది. ముంబైలో జరిగే మొదటి షెడ్యూల్‌లో ఈ జంటపై కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటను చిత్రీకరిస్తారని ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టబోతుంది.

  సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

   Varun Tej to Romance with Manushi Chhillar in VT13

  శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ముంబైలో షూట్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.

  English summary
  Mega Prince Varun Tej Now Doing His 13th Movie Under Shakti Pratap Singh Hada Direction. Manushi Chhillar to play famale Lead in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X