వరుణ్ తేజ్ స్పీడ్ మామూలుగా లేదు.. మరో టాలెంటెడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా రోజుల తరువాత మళ్ళీ డిఫరెంట్ సినిమాలతో బిజీ అయ్యాడు. సోదరి నీహారిక పెళ్లి అనంతరమే సినిమాల కోసం వర్కౌట్స్ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్
మొత్తానికి F3 సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు. అలాగే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న గని సినిమా పనులను కూడా మొదలు పెట్టాడు.
కొత్త దర్శకుడు కిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. ఇక ఇటీవల సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. జూలై 30న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక F3 సినిమా ఆగస్టు 28న రాబోతోంది. అయితే ఇదే ఏడాది మరో టాలెంటెడ్ దర్శకుడి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు వరుణ్ తేజ్.

ఆ దర్శకుడు మరెవరో కాదు. ప్రవీణ్ సత్తారు. గరుడవేగా సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడు నాగార్జునతో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా వరుణ్ తేజ్ కు కూడా ఒక సీరియస్ స్టోరీని వినిపించినట్లు సమాచారం. నాగ్ తో సినిమా అయిపోగానే వచ్చే ఏడాది ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్రవీణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ సినిమాలు రెండు ఈ దర్శకుడికి ఎలాంటి క్రేజ్ ను అందిస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











