twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ రిలీజ్ డేట్ ఖరారైంది

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని '14 రీల్స్ ప్లస్' పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 'వాల్మీకి' షూటింగ్ టాకీ పార్ట్ యాభై శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. చిత్రీకరణ దగ్గర పడటంతో రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    Varun Tej upcoming film Valmiki relesing on September 6th

    తమిళ కల్ట్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'జిగర్తాండ' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. సిర్థార్థ్ పాత్రలో అథర్వ మురళి కనిపించబోతున్నారు.

    'ఎఫ్ 2' విజయం తర్వాత వరుణ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగింది. అందుకు తగిన విధంగానే 'వాల్మీకి' చిత్రాన్ని 14 రీల్స్ ప్లాస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలోనిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    వరుణ్ తేజ్ రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా... డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 'వాల్మీకి'లో తనది కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ చేయడానికి ఒప్పుకున్నాడట.

    English summary
    Varun Tej upcoming film Valmiki’s producers have sealed the film’s release date. The will be hitting screens September 6. Pooja Hegde is the leading lady in Valmiki.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X