భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. పోటీ లేకుండా మరో కొత్త డేట్ ఫిక్స్ చేసుకోబోతున్న గని!
మెగా హీరో వరుణ్ తేజ్ కూడా వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. 2019 లో గద్ధల కొండ గణేష్ అనంతరం అతను మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆ తరువాత వీలైనంత త్వరగా మరొక సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడక తప్పలేదు. బాక్సింగ్ నేపథ్యంలో చేసిన గని సినిమాను గత ఏడాది డిసెంబర్ లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప సినిమా కారణంగానే వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరిలో అయినా విడుదల చేద్దామని అంటే భీమ్లా నాయక్ సినిమా వచ్చి చేరింది. నిర్మాతల మధ్యలో చర్చలు బాగానే జరిగినప్పటికీ వరుణ్ తేజ్ మాత్రం బాబాయ్ సినిమాతో పోటీ ఉండకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఆలస్యం అయినా పరవాలేదు అని మరొక డేట్ ఫిక్స్ చేసుకోవాలని నిర్మాతలకు వరుణ్ తెలిపడట. దీంతో నిర్మాతలు ప్లాన్ చేంజ్ చేశారు.
ఫిబ్రవరి 25న గని సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇక అది కుదరకపోవడంతో ఇప్పుడు మార్చి 4వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ వేశారు. ఆ డేట్ కు మిగతా సినిమాల నుంచి పెద్దగా పోటీ లేదని నిర్మాతలు ఫిక్స్ చేయడానికి సిద్ధమయ్యారట. కానీ మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమా రానుంది. ఈ సినిమాకు కొంత గ్యాప్ ఎక్కువగానే ఉన్నప్పటికీ కొంత ప్రభావం చూపవచ్చు. మరి నిర్మాత అల్లు బాబీ ఏ విదంగా ఆలోచిస్తారో చూడాలి. ఒకవేళ మార్చి 4 క్యాన్సిల్ అయితే ఆ తరువాత మరొక డేట్ దొరకడం అంటే మిగతా సినిమాలతో కొంత పోటీని ఎదుర్కోవాల్సిందే.

గని సినిమాను నిర్మించింది మరెవరో కాదు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ. అతనికి ఇదే మొదటి సినిమా. అల్లు అరవింద్ ముందుండి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. గని సినిమాకు నాన్ థియేట్రికల్ గా పెట్టిన పెట్టుబడి కూడా ముందే వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంలో అల్లు అరవింద్ బాగా హెల్ప్ చేశారని టాక్. ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా ఆహా కొనుగోలు చేసింది. ఇక గని సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ నేర్చుకున్నాడు. అంతే కాకుండా సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఫిట్నెస్ విషయంలో వరుణ్ మొదటిసారి భారీగా మార్పులు చేశారు. సినిమా కథకు తగ్గట్టుగా తనను తాను మార్చేసుకొని ఫుల్ గా కండలు పెంచేశాడు. మరి సినిమాలో అతని పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సీనియర్ హీరో కూడా ఉపేంద్ర ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే యువ టాలెంటెట్ నటుడు మవీన్ చంద్ర కూడా కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











