VT13: వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్'.. దర్శకుడిగా మారిన లాయర్.. స్పీడుగా రిలీజ్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వాళ్లలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఒకరు. ముకుంద మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చిన వరుణ్ తేజ్ మిగతా హీరోల్లో కమర్షియల్ సినిమాలు చేయుకుండా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా కంచె, ఫిధా, అంతరిక్షం వంటి ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవల గనితో ప్లాప్ చూసిన అతను ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. వరుణ్ తేజ్ తన కొత్త సినిమా (VT 13) కి టైటిల్ ఎంటో రివీల్ చేశారు మేకర్స్.

ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు వరుణ్ తేజ్. అయితే గత కొంతకాలంగా ఫ్లాపులు చూస్తున్న వరుణ్ తేజ్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్నాడు. అందుకే రెండు, మూడు కాన్సెప్ట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna) సినిమా ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోపాటు ఇటీవలే వరుణ్ తేజ్ తన 14వ (VT 14) చిత్రాన్ని టైటిల్ తో సహా ప్రకటించాడు.

Varun Tej VT13 Title As Operation Valentine And Released On December 8

వరుణ్ తేజ్ 14వ సినిమాకు 'మట్కా' (Matka Movie) అని ఆసక్తికరంగా టైటిల్ పెట్టారు. దీనికి పలాస (Palasa) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైరా ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డా. విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇదే కాకుండా దీనికంటే ముందుగా వరుణ్ తేజ్ 13వ (VT 13) సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు.

తాజాగా VT 13 టైటిల్ ను 'ఆపరేషన్ వాలెంటైన్' (Operation Valentine) అనౌన్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ ను షేర్ చేస్తూ 'భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనించబోతోంది' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు వరుణ్ తేజ్. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. డిసెంబర్ 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె రాడార్ ఆఫీసర్ గా కనిపించనుందట. అలాగే వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా అలరించనున్నాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. న్యాయవాది అయినా ప్రతాప్ సింగ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆయన ఇప్పటికే పలు యాడ్ ఫిల్మ్స్ చేసినట్లు చేశారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X