For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా హీరోకు అమాంతం పెరిగిపోయిన రెమ్యూనరేషన్.. నాని, విజయ్ రికార్డ్ బ్రేక్.!

  |

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా 'ఫిదా' వంటి హిట్ సినిమా తర్వాత వరుణ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. తాజాగా అతడి రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  ‘గద్దలకొండ గణేష్'గా గత్తర లేపేశాడు

  ‘గద్దలకొండ గణేష్'గా గత్తర లేపేశాడు

  ‘గద్దలకొండ గణేష్' సినిమాతో గత్తర లేపేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాదు, ఇందులో వరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు క్లాస్ పీపుల్‌కే నచ్చిన వరుణ్.. ఈ సినిమాతో మాస్ ఆడియెన్స్‌నూ మెప్పించాడు.

  ఈ సారి బాక్సర్‌గా మారాడు

  ఈ సారి బాక్సర్‌గా మారాడు

  వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న బాక్సింగ్ నేపథ్య సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.ఈ సినిమా కోసం వరుణ్.. బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

  సైరా దర్శకుడితో సినిమా అన్నారు

  సైరా దర్శకుడితో సినిమా అన్నారు

  ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గద్దలకొండ గణేష్' తర్వాత అతడు కిరణ్ కొర్రపాటి సినిమాలో నటించాల్సి ఉంది. అయితే, ఈ సినిమాను ఆపేసి ‘సైరా: నరసింహారెడ్డి' దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్రాజెక్టు చేయబోతున్నాడని ఈ మధ్య ప్రచారం జరిగింది. దీంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది.

  రెమ్యూనరేషన్ ఎంతంటే..

  రెమ్యూనరేషన్ ఎంతంటే..

  ‘బాక్సర్' సినిమా కోసం వరుణ్ తేజ్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 5 నుంచి 8 కోట్లు మాత్రమే తీసుకున్న ఈ మెగా వారి అబ్బాయి ఈ సినిమాకు గానూ అతడు రూ. 10 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. దీనికి కారణం అతడి మార్కెట్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

  నాని, విజయ్ రికార్డ్ బ్రేక్

  నాని, విజయ్ రికార్డ్ బ్రేక్

  ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న నేచురల్ స్టార్ నాని, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 8 నుంచి 9 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. ఇప్పుడు దీన్ని వరుణ్ తేజ్ అధిగమించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

  #CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
  రూ. 2 కోట్లతో మొదలైంది

  రూ. 2 కోట్లతో మొదలైంది

  ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ‘F2' సినిమాకు గానూ వరుణ్ తేజ్ రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. అలాగే, ఇటీవల వచ్చిన ‘గద్దలకొండ గణేష్' కోసం అతడు రూ. 6 కోట్లు చార్జ్ చేశాడట. అయితే, వరుస విజయాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడది రూ. 10 కోట్లు అయిందని సమాచారం.

  English summary
  Varun Tej after the super success of F2 took a small break and started shooting for Valmiki directed by Harish Shankar. Varun Tej has been taking Rs 3 crores pay cheque for his films and the actor after F2 ended up as a huge money spinner decided to hike his fee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X