కరోనా ఎఫెక్ట్ : వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మెగా హీరో!
కరోనా దెబ్బకు జనజీవనం స్థంభించేలా కనిపిస్తోంది. ఇప్పటికే జన సమూహాలు ఎక్కువగా ఉండే విద్యా సంస్థలు, థియేటర్స్, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మూసి వేసింది ప్రభుత్వం. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని వివిద రాష్ట్రాల పరిస్థితి ఇంతే ఉంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పదిహేను రోజుల పాటు ఎటువంటి షూటింగ్స్ జరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టాలీవుడ్ అంతా ఎటువంటి కార్యకలాపాలు జరగక సైలెంట్ అయిపోయింది.

స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ సైతం వాయిదా పడ్డాయి. ఆర్ఆర్ఆర్, వకీల్ సాబ్ వంటి మూవీ షూటింగ్స్ ఆగిపోయాయి. అందరూ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. అందరూ ఇట్టిపట్టునే ఉన్నారు. అలా వరుణ్ తేజ్ కూడా ఇంట్లోనే ఉన్నా తన తదుపరి చిత్రం కోసం చేసే వర్కౌట్స్, ప్రాక్టీస్ సెషన్స్‌ను మాత్రం వాయిదా వేయలేదు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న పిక్‌ను వరుణ్ తేజ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











