For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ ‘గని’ రికార్డులు: ఆ రెండింటికే రూ. 25 కోట్లు డీల్

    |

    ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ సత్తా చాటుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ జోష్‌లోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇక, ఇప్పుడు ఈ మెగా హీరో నటిస్తోన్న చిత్రమే 'గని'. కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రాబోతుంది. వాస్తవానికి ఇది ఎప్పుడో మొదలైనా.. అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ తరచూ వాయిదా పడుతోంది. దీంతో ఈ ప్రభావం సినిమా విడుదల పైనా పడుతోంది. ఇది వాయిదా పడుతున్న కొద్దీ దీనిపై ఆసక్తితో పాటు అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

    'గని' సినిమా షూటింగ్ కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ నెలలోనే చిత్రీకరణను పున: ప్రారంభించి పూర్తి చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'గని' ఆడియో హక్కులను లహరి సంస్థ రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసిందట. మీడియం రేంజ్ హీరోలలో ఇది హయ్యెస్ట్ అమౌంట్ అని అంటున్నారు. అలాగే, ఈ సినిమా డిజిటల్ హక్కులు ఇప్పటికే ఆహా సంస్థ తీసుకుందట. ఇందుకోసం ఏకంగా రూ. 24 కోట్ల వరకూ చెల్లించిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    Varun Tejs Ghani Movie Audio and Digital Rights Sold Out

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. భావోద్వేగాలతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని కోసం విదేశాలకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్లు కూడా పని చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు. వీళ్లతో పాటు హిందీ హీరో సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    English summary
    Varun Tej Now Doing Ghani Movie Under Kiran Korrapati Direction. Recently This Film Audio and Digital Rights Sold Out for Huge Price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X