ఇది విన్నారా... ఆ హీరో కాదన్నాకే విజయ్ కు అవకాశం వచ్చిందట!
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్ రేంజ్ లో మారుమోగిపోతోంది. పూరీజగన్నాథ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ఫైటర్ తో మనోడు మరో లెవెల్ కు వెళ్లిపోతాడు అనడంలో సందేహమే లేదు. అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హిందీ వర్షన్ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండటంతో ఫైటర్ ఓ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది.

అనుకోని అవకాశం...!
ఈ కథాకమామీషు అంతా పక్కన పెడితే, అర్జున్ రెడ్డి తరువాత గీతా గోవిందం మూవీ మనోడిని సోలో హీరోగా పది మెట్లు పైకి ఎక్కించిందని చెప్పుకోవాలి. మనోడి నటన, రష్మికతో వర్కౌట్ అయిన కెమిస్ట్రీ బాక్సాఫీసును ఓ ఊపు ఊపేసింది. అయితే, విజయ్ కు ఈ అవకాశం అంత తేలిగ్గా రాలేదని తెలుస్తోంది.

విజయ్ టీమ్ కు బన్నీ పార్టీ...
గీతాగోవిందం డైరెక్టర్ పరుశురామ్ తొలుత ఈ కథతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశాడట. బన్నీకి కూడా కథ బాగా నచ్చింది. కానీ, మరోసారి లవర్ బాయ్ గా కనిపించడం ఇష్టంలేక అర్జున్ సరైనోడు సినిమాను ఎంపిక చేసుకున్నాడు. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన గీతాగోవిందం సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న తరువాత, బన్నీ టీమ్ అందరికీ పెద్ద పార్టీ ఇచ్చిన సంగతి తెలసిందే.
Recommended Video

శేషాచలం అడువుల్లో జీవన పోరాటం
ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శేషాచలం అడువుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.


Click it and Unblock the Notifications











