Kingdom Teaser Review: కింగ్ డమ్ టీజర్ రివ్యూ.. ఎన్టీఆర్ ఆవేశంగా.. విజయ్ దేవరకొండ యాంగ్రీమ్యాన్‌గా
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం VD12. ఈ చిత్రానికి సాయి సౌజన్య, గిరీష్ దశిక సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రక్మిణీ వసంత్, భాగ్యశ్రీ భోర్సే, శ్రీరామ్ రెడ్డి, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు నటిస్తున్నారు. VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాకు టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ గురించిన వివరాల్లోకి వెళితే..
VD12 సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గీరీశ్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నవీన్ నూలి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోలా అవినాశ్ ఆర్ట్ విభాగం పనులను పర్యవేక్షిస్తున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో నటించే 12వ చిత్రానికి కింగ్ డమ్ అని టైటిల్ ఖరారు చేశారు. గత కొద్దికాలంగా ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడుతారనే ఆసక్తి నెలకొని ఉన్నది. ఆసక్తిని మించి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించే విధంగా టైటిల్‌ను ప్రకటించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా టీజర్‌ను అత్యంత ఎమోషనల్‌గా, యాక్షన్ దట్టించి వదిలారు. అలసట లేని భీకర యుద్దం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయిన, అలసిపోయినా ఆగిపోనిది ఈ మహ రణం. నేలపైన దండయాత్రలో మట్టికింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరికోసం.. ఇంత భీభత్సం ఎవరి కోసం.. అసలు ఈ వినాశనం ఎవరి కోసం.. రణభూమిని చీల్చుకొంటూ పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మను ఎత్తిన నా యుముడి కోసం అని ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్‌లో విజయ్ దేవరకొండ గురించి కామెంటరీ వినిపించాడు.

ఇక జైలులో విజయ్ దేవరకొండ ఆర్తనాదాలు చేస్తూ ఎమోషనల్‌గా కనిపించాడు. ఓ అధికారి ముందు కూర్చొని.. ఏమైనా చేస్తా సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ దేవరకొండ యాంగ్రీమ్యాన్‌గా కనిపించడం టీజర్‌లో విశేషంగా కనిపించింది. మే 30వ తేదీ 2025 ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో కింగ్‌డమ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఈ చిత్రానికి తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాల్లోకి వెళితే
నటీనటులు: విజయ్ దేవరకొండ, తదితరులు
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్
కూర్పు: నవీన్ నూలి
కళా దర్శకత్వం: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
నృత్య దర్శకుడు: విజయ్ బిన్నీ
యాక్షన్ దర్శకులు: యానిక్ బెన్, చేతన్ డిసౌజా , రియల్ సతీష్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్


Click it and Unblock the Notifications











