twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్‌హాట్‌గా వీణామాలిక్ శృంగార విశ్వరూపం.. 28న రెడ్ మిర్చీ

    |

    Recommended Video

    Bollywood Actress Veena Milk Coming With Red Mirchi

    పాకిస్థాన్ సంతతికి చెందిన హీరోయిన్ వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెడ్ మిర్చీ'. 'సిల్క్' అనే పేరుతో కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం శాండల్‌వుడ్ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రూ. 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.

    అందంతో అదరగొట్టిన వీణామాలిక్ (ఫొటో గ్యాలరీ)

    తాజాగా సిల్క్ చిత్రాన్ని తెలుగులో 'రెడ్ మిర్చీ' పేరుతో పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

    Veena Malik glamour going to sizzle in Red Mirchi

    ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ.. ''కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయంతో టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన మా 'రెడ్ మిర్చీ'ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం అని తెలిపారు.

    వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీగిఫ్ట్స్, కెమెరా: జైఆనంద్, ఎడిటర్: సంజీవరెడ్డి, మాటలు,పాటలు: భారతీబాబు, సమర్పణ: పి.వి.యన్, విడుదల: యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత: కరణ్, దర్శకత్వం: త్రిశూల్.

    English summary
    Bollywood actress Veena Milk coming with Red Mirchi, which was remake of Kannada film Silk Sakkath Maga. This movie is going to release on September 13th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X