Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్‌హాట్‌గా వీణామాలిక్ శృంగార విశ్వరూపం.. 28న రెడ్ మిర్చీ
Recommended Video
పాకిస్థాన్ సంతతికి చెందిన హీరోయిన్ వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రెడ్ మిర్చీ'. 'సిల్క్' అనే పేరుతో కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం శాండల్‌వుడ్ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రూ. 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.
అందంతో అదరగొట్టిన వీణామాలిక్ (ఫొటో గ్యాలరీ)
తాజాగా సిల్క్ చిత్రాన్ని తెలుగులో 'రెడ్ మిర్చీ' పేరుతో పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ.. ''కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన మా 'రెడ్ మిర్చీ'ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం అని తెలిపారు.
వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీగిఫ్ట్స్, కెమెరా: జైఆనంద్, ఎడిటర్: సంజీవరెడ్డి, మాటలు,పాటలు: భారతీబాబు, సమర్పణ: పి.వి.యన్, విడుదల: యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత: కరణ్, దర్శకత్వం: త్రిశూల్.