Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Veera Simha Reddy బాలకృష్ణ ఫ్యాన్స్‌కు అమెరికా పోలీసుల షాక్.. డల్లాస్‌లో ప్రదర్శన నిలిపివేత
అమెరికాలో వీరసింహారెడ్డి ప్రీమియర్లకు భారీ స్పందన కనిపిస్తున్నది. సంక్రాంతి సీజన్ కావడంతో నందమూరి అభిమానులు భారీగా థియేటర్లకు పరుగులుపెట్టారు. బాలయ్య నటించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పాటలు క్రేజ్ పెంచడంతో సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయి. అయితే నందమూరి ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహం అమెరికా పోలీసుల ఆగ్రహానికి దారి తీసింది. దాంతో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. అందుకు కారణమైన సంఘటనల వివరాల్లోకి వెళితే..

అమెరికాలో 616 షోలు
అమెరికాలోని వీరసింహారెడ్డి చిత్రానికి భారీ క్రేజ్ లభించింది. దాంతో ఈ సినిమాను 274 లోకేషన్లలో 616 షోలు ప్రీమియర్లుగా ప్రదర్శించారు. ప్రీమియర్ల ద్వారానే హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నందమూరి ఫ్యాన్స్ భారీగా థియేటర్లకు పోటెత్తారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
|
నందమూరి అభిమానుల రచ్చ
వీరసింహారెడ్డికి
ప్రవాసాంధ్రులు
భారీ
ఏర్పాట్లతో
వచ్చారు.
థియేటర్లను
భారీగా
ముస్తాబు
చేశారు.
బస్తాల్లో
కాగితాలు
తీసుకొచ్చి
రచ్చ
చేశారు.
అభిమాన
హీరో
డైలాగ్స్,
పలు
సన్నివేశాలు
విజిల్
వేస్తూ..
థియేటర్లలో
హంగామా
సృష్టించారు.
అయితే
పలుమార్లు
థియేటర్
యాజమాన్యం
హెచ్చరించినా
కాగితాలు
విసరడం
ఆపలేదు.
దాంతో
యాజమాన్యం
పోలీసులను
ఆశ్రయించారు.

అమెరికా పోలీసులు రంగంలోకి
నందమూరి అభిమానుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా పోలీసులు రంగంలోకి దిగారు. వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శనను నిలిపివేసి అధికారులు ప్రేక్షకులతో ముచ్చటించారు. అయినా లాభం లేకపోవడంతో వార్నింగ్ ఇచ్చారు. అల్లరి, కాగితాలు విసరడం ఆపకపోతే బయటకు పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. సెక్యూరిటీ అధికారులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

పద్దతి మార్చుకోకపోతే నిలిపివేస్తాం
డల్లాస్‌లో వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శించే థియేటర్‌లో ప్రేక్షకులతో పోలీసులు మాట్లాడుతూ.. మీరు ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తున్నందుకు సారీ.. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ సినిమా చూడటం ఇలా కరెక్ట్ కాదు. సినిమా చూసే పద్దతి మార్చుకోకపోతే.. కాగితాలు వేసి రచ్చ చేస్తే ఒప్పుకోం. ఇదే కంటిన్యూ అయితే బయటకు పంపిస్తాం. సినిమాను నిలిపివేస్తా అని పోలీసులు హెచ్చరించారు.
|
డల్లాస్ గడ్డ.. బాలయ్య బాబు అడ్డా
వీరసింహారెడ్డి ప్రీమియర్‌కు ముందు డల్లాస్‌లో కారు ర్యాలీ నిర్వహించారు. బ్యానర్లు, ప్లకార్డులు పదర్శిస్తూ భారీ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లారు. జై బాలయ్య, జై బాలయ్య.. డాలస్ గడ్డ.. బాలయ్య బాబు అడ్డా.. కోకాకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అంటూ నినాదాలు చేశారు. కిలోమీటర్ మేరకు కారు ర్యాలీ నిర్వహించారు.