Veera Simha Reddy twitter review వైసీపీ బ్యాచ్ చూడకండి.. హర్ట్ అవుతారు.. డైలాగ్స్‌తో వీరసింహారెడ్డి పవర్ పంచ్

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. VeeraSimhaReddyOnJan12th, Jaibalaiah, Nanadamuri Balakrishna లాంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

బాలక‌ృష్ణ సింహంలా గర్జించాడు

ఫస్టాఫ్ గుడ్, వీరసింహారెడ్డి పాత్రలో బాలక‌ృష్ణ సింహంలా గర్జించాడు. మాస్‌గా యాక్షన్ ఎపిసోడ్స్. తమన్ బీజీఎం అదుర్స్, శ్రుతి హాసన్, బాలయ్య మధ్య సీన్లు అంత నచ్చలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యూరప్‌లో వీరసింహారెడ్డి షో కంప్లీట్

యూరప్‌లో వీరసింహారెడ్డి షో కంప్లీట్ అయింది. సూపర్ హిట్. ఏబీసీ అనే తేడా లేకుండా బాలకృష్ణ బ్యాటింగ్ మొదలైంది. జై బాలయ్య అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు

వీరసింహారెడ్డి చిత్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. పోలిటికల్ డైలాగ్స్‌తో కేక పెట్టించారు. వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు. గౌరవించడం మన విధి అంటూ బాలకృష్ణతో చెప్పించిన డైలాగ్స్ సినిమాలో పవర్‌ఫుల్‌గా కనిపించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

బాలకృష్ణ ఎంట్రీ కేక

బాలకృష్ణ ఎంట్రీ కేక, సుగుణ సుందరి పాట బ్లాస్టింగ్, వైఎస్ఆర్సీపీపై డైరెక్ట్ ఎటాక్ చేస్తూ బాలయ్య డైలాగ్స్, చెన్నకేశవ రెడ్డిని మించి థమన్ మ్యూజిక్. స్టోరీ హైలెట్ అంటూ కామెంట్ చేశాడు.

డెన్మార్క్‌లో వీరసింహారెడ్డి

డెన్మార్క్‌లో వీరసింహారెడ్డి

డెన్మార్క్‌లో వీరసింహారెడ్డి 10.45 గంటలకు ప్రారంభమైంది. త్వరలోనే లైవ్ అప్‌డేట్స్ అందుకోవడానికి రెడీగా ఉండండి అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ట్వీట్

వరలక్ష్మీ శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. భానుమతి మిమ్మల్ని కలుసుకోవడానికి వెయిట్ చేయడం కష్టంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ నన్ను చక్కగా చూపించాడు. తమన్ మ్యూజిక్ చూడటానికి ఇంకా ఆతృత పెరిగింది. మైత్రీ మూవీస్ మేకర్స్.. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫేక్ రివ్యూలకు కుట్ర

వీరసింహారెడ్డి సినిమాపై కుట్రకు కొందరు తెరలేపారు. ఐదుగురికి డబ్బులిచ్చి ఫేక్ రివ్యూలు, ఫేక్ ఆర్టికల్స్ వేస్తారు. మూవీ రొటీన్, హింస ఎక్కువుందని రాస్తారు. ఈ సినిమా రేటింగ్ 2.5 అని రేటింగ్ వేస్తారు. కాబట్టి ఫ్యాన్స్ షో చూసే అభిమానులు ఈ కుట్రను తిప్పి కొట్టడానికి రెడీగా ఉండాలి..

అమెరికా టూ అనకాపల్లి

వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. అమెరికా నుండి అనకాపల్లి దాకా నైజాం నుండి న్యూజెర్సీ దాకా ఒక్కటే దంచుడు నువ్వు ఫామ్ లోకి వస్తే ఏ ఏరియా అయిన నీకు స్ట్రాంగ్ ఫోర్ట్ ఏ బాలయ్య #JaiBalayya అంటూ అభిమాని ట్వీట్ చేశారు.

సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బెటర్

వీరసింహారెడ్డి సెకండాఫ్‌ అంతగా బాగా లేదు.. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బెటర్. కథను పక్కన పడేసి డైరెక్టర్ అనవసర విషయాలపై ఎందుకు పడ్డారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

వైసీపీ ప్రభుత్వంపై భారీగా

వీరసింహారెడ్డి చిత్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై భారీగా డైలాగ్స్ ఉన్నాయి. వైసీపీ బ్యాచ్ మాత్రం చూడవద్దు. ఆ పార్టీని బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ గట్టిగా వేసుకొన్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్టాఫ్, ఇంటర్వెల్ వీరలెవెల్

వీరసింహారెడ్డి సినిమా గురించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫస్టాఫ్, ఇంటర్వెల్ వీరలెవెల్.. సెకండాఫ్, క్లైమాకస్ అదిరిపోతుంది. మీరు చించి తెచ్చుకొన్న పేపర్ బస్తాలు.. ఇంటర్వెల్‌కు అయిపోతాయి. సెకండాఫ్‌ కోసం వేరే బస్తాలు తెచ్చుకొండి. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని బాలకృష్ణ అభిమాని ట్వీట్ చేశారు.

ఫస్టాఫ్ డీసెంట్. ఎలివేషన్ సీన్లు ఇరగదీశాడు

వీరసింహారెడ్డి ఫస్ట్ 30 నిమిషాలు కొంత బోర్‌గా ఉంది. ఆ పార్ట్ వదిలేస్తే.. ఫస్టాఫ్ డీసెంట్. ఎలివేషన్ సీన్లు ఇరగదీశాడు. బాలయ్య, తమన్ మాస్ డ్యూటీ చేశారు. ఫైట్ సీన్లను తమన్ బాగా ఎలివేట్ చేశారు. అఖండ సినిమాను గోపిచంద్ ఫాలో అయిపోయారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

పొలిటికల్ డైలాగ్స్ పేలిపోయాయి

ఫస్టాఫ్ మాస్‌గా కొనసాగింది. సెకండాఫ్‌లో యాక్షన్ బ్లాక్స్‌లో వైసీపీని టార్గెట్ చేయడమే పెట్టుకొన్నాడు. పొలిటికల్ డైలాగ్స్ పేలిపోయాయి. తమన్ బీజీఎం హైలెట్. సీనియర్ బాలయ్య వన్ మ్యాన్ షో.. బీ, సీ సెంటర్లో ఇక కుమ్ముడే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

జోకర్‌పై పవర్‌ఫుల్ డైలాగ్స్

వీరసింహారెడ్డి ఫస్ట్ 20 నిమిషాలు వదిలేస్తే.. మిగితాదంతా మెంటల్స్. జోకర్‌పై పవర్‌ఫుల్ డైలాగ్స్ పేలాయి. ఫైట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ థమన్ ముంత మోతే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తండ్రి గెటప్‌లో బాలయ్య ఎంట్రీ

వీరసింహారెడ్డి ఫస్టాఫ్ బాగుంది. ఇస్తాంబుల్‌లో బాలయ్య ఎంట్రీ బాగుంది. పాటలు గుడ్. తండ్రి గెటప్‌లో బాలయ్య ఎంట్రీ బాగుంది. పొలిటికల్ డైలాగ్స్ పేలిపోయాయి. ఇస్తాంబుల్ ఫైట్ హైలెట్. ఫ్యాన్స్‌కు బ్రహ్మండమైన ట్రీట్ అని నెటిజన్ కామెంట్ చేశారు.

శృతిహాసన్ సీన్లు ఫస్టాప్‌లో

ఫస్టాఫ్‌లో 6 ఫైట్స్ సూపర్, 4 స్లో మోషన్ షాట్స్ అదిరిపోయాయి. 3 పాటలు సూపర్. శృతిహాసన్ సీన్లు ఫస్టాప్‌లో కేక పెట్టించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సంక్రాంతికి ముందే పండుగ

థ్యాంక్స్ మలినేని గోపిచంద్. సంక్రాంతికి ముందే పండుగ తీసుకొచ్చావు. సెకండాప్ మాస్ ఎలిమెంట్స్‌తో పండగ వాతావరణాన్ని తెచ్చి కుమ్మేశావు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X