అస్వస్థతకు గురైన గొల్లపూడి.. పరామర్శించిన ఉప రాష్ట్రపతి
కడుపుబ్బా నవ్వించే కామెడీ అయినా, విషం కక్కే విలనిజం అయినా, కంటతడి పెట్టించే పాత్రలోనైనా ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా నటవిశ్వరూపాన్ని చూపించగల నటుడు గొల్లపూడి మారుతి రావు. డైలాగ్ డెలీవరిలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న గొల్లపూడి.. ప్రస్తుతం వయోభారం కారణంగా ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు.
రచయితగా ప్రసిద్ది చెందిన గొల్లపూడి సినిమాల ద్వారా అందరికీ సుప్రసిద్దులయ్యారు. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో గొల్లపూడి ప్రత్యేక శైలిని అవలంభిస్తారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఈ వార్త తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయనను కలిసి పరామర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరి కుమారులు ఉపరాష్ట్రపతిని కలిశారు. సునిశితమైన విమర్శకు, ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించడంలో గొల్లపూడి గారు పెట్టింది పేరని.. ఆయన త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











