Naga Chaitanya: ఒక్క పాట కోసం ఏకంగా 7 సెట్స్.. శంకర్ కు మించిన స్థాయిలో నాగ చైతన్య 'కస్టడీ' సాంగ్!
జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య తనదైన శైలీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ ఫలితాలాతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉండే చైతూ ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అంతగా విజయం సాధించలేదు. ఇక హిందీలో లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చైతూ తాజాగా ద్వి భాష చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమానే కస్టడీ. తెలుగు, తమిళం ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాట కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

అభిమానులను నిరాశ పరిచి..
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ చైతన్య. 2009లో జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అక్కినేని యువ హీరో సినీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకున్నా కథ పరంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ మూవీ అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. ఇక ఆ మూవీ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్ కొట్టాడు నాగ చైతన్య.

డిజాస్టర్ గా ఆ మూవీ..
ఏ మాయ చేశావే సినిమాలో సమంతతో ముద్దు సీన్లు, చైతూ నటనతో యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు నాగ చైతన్య. ఇక ఇటీవల నాగ చైతన్య సినిమాలు అంతగా హిట్ కావట్లేదు. మనం వంటి మంచి ఫీల్ గుడ్ మూవీ తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన థ్యాంక్యూ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న లాల్ సింగ్ చద్ధా కూడా ఫ్లాప్ అయింది.

మే 12న ప్రేక్షకుల ముందుకు..
ఈ రెండు ఫ్లాప్ ల తర్వాత ఇప్పుడు తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. కస్డడీ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. నాగ చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

తండ్రి కొడుకులు కలిసి..
కస్టడీ సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించగా కృతీ శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు. కస్టడీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకేసారి పనిచేయడం ఇదే తొలిసారి.

శంకర్ సినిమా స్థాయిలో..
అయితే పాట చిత్రీకరణలో లెజండరీ డైరెక్టర్ శంకర్ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లోని పాటల్లో భారీతనం కనిపిస్తుంది. ఎవరూ చూడని కొత్త లొకేషన్స్ లో సాంగ్స్ షూట్ చూసి చూపిస్తారు. లేదంటే భారీ సెట్స్ వేస్తారు. ఇప్పుడు శంకర్ సినిమా సాంగ్స్ స్థాయిలో అక్కినేని నాగ చైతన్య లేటేస్ట్ మూవీ కస్టడీలోని పాటను డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

భారీ బడ్జెట్ చిత్రంగా..
కస్టడీ సినిమాలో చైతూ, కృతీ శెట్టిపై చేస్తున్న సాంగ్ షూట్ కోసం ఏకంగా ఏడు సెట్స్ వేయించారట డైరెక్టర్ వెంకట్ ప్రభు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డి.వై. సత్యనారాయణ కలిసి ఈ భారీ సెట్స్ రూపొందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట వెండితెరపై విజువల్ ఫీస్ట్ ఇవ్వనుందని సమాచారం. ఇక నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా కస్టడీ ఉండనుంది. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా.. ఎస్ఆర్ ఖదీర్ సినిమాటోగ్రఫీ, వెంకట్ రాజన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











