twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లాద్దీన్ దీపం దొరికితే ఏం చేస్తానంటే.. చిలిపిగా వెంకీ, వరుణ్ జవాబులు

    |

    సంక్రాంతికి రిలీజైన F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించడం ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ వరుణ్ తేజ్, వెంకటేష్ ఒక్కటయ్యారు. కానీ ఈ సారి తెర ముందు కాదు.. తెర వెనుక.. హాలీవుడ్‌లో తెరకెక్కిన అలాద్దీన్ సినిమా కోసం వీరద్దరూ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..

    డిస్నీ మూవీస్ అంటే పిల్లలకే కాదు. నాకు కూడా చాలా ఇష్టం. మా పిల్లలతో కలిసి డిస్నీ మూవీస్ ఎంజాయ్ చేసేవాడిని. అల్లాద్దీన్ సినిమా కోసం నన్ను డబ్బింగ్ చెప్పమని అడిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చేరితే బాగుంటుందనిపించింది. మరోసారి ప్రేక్షకులకు దగ్గర కావాలనే ఉద్దేశంతో డిస్నీ వాళ్లు అడుగగానే ఒప్పుకొన్నాను అని వెంకటేష్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

    Venkatesh and Varun Tej witty answer in Alladdin press meet

    అల్లాద్దీన్ సినిమాలో జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఓ మధురానుభూతి. జీని పాత్ర రూపం కూడా చాలా వినోదాత్మకంగా కనిపించింది. నాకు అల్లాద్దీన్ నాకు మెంటర్ లాంటి వాడు. నాకు వాయిస్‌కు సరిగా సరిపోయే పాత్ర అనిపించింది. అందుకే బాగా కనెక్ట్ అయిపోయాను. విల్ స్మిత్ బాడీ లాంగ్వేజ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. అతని పాత్రకు డబ్బింగ్ చెప్పడం కొంత కష్టమైంది. కామెడీ చేయడమంటే నాకు ఇష్టం కాబట్టి.. మంచి ఫీల్‌తో డబ్బింగ్ చెప్పాను అని అన్నారు. జీని ఎదురైతే కోరిక కోరుతాను.. కానీ అవి బయటకు చెప్పను అంటూ వెంకటేష్ చిలిపిగా జవాబిచ్చారు.

    అల్లాద్దీన్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఎప్పుడో చిన్నప్పుడు అల్లాద్దీన్ సినిమా చేశాను. మా చెల్లితో కలిసి గేమ్ కూడా ఆడేవాళ్లం. బాల్యంలోని మెమొరీస్ మళ్లీ గుర్తుకు వచ్చాయి. అలాంటి పాత్రకు నేను డబ్బింగ్ చెప్పడం నా అదృష్టంగా భావిస్తాను. మీ అందరికంటే అల్లాదీన్ సినిమా చూశాననే ఫీలింగ్ గొప్పగా ఉంది. ఈ సినిమా నాకు గొప్ప అనుభవాన్ని మిగిల్చింది.

    Venkatesh and Varun Tej witty answer in Alladdin press meet

    అలాద్దీన్‌కు వెంకటేష్ డబ్బింగ్ చెబుతున్నట్టు నాకు తెలియదు. నేను డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చినప్పడు సినిమా యూనిట్ వాళ్లు చెబితే హ్యాపీగా ఫీలయ్యాను. వెంకటేష్‌గారు జీనీ పాత్రకు వాయిస్‌ చెబుతున్నారని అన్నారు. దాంతో అల్లాద్దీన్‌ కోసం మళ్లీ వెంకటేష్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఎఫ్‌2 అందించిన విజయంతో అల్లాద్దీన్ కోసం హుషారుగా పనిచేశాం అని వరుణ్ అన్నారు. అల్లాద్దీన్ దీపం దొరికితే ఏం కోరుకోవాలో అనేది ఆలోచించుకొవాల్సిందే. నాకు ఎప్పడూ సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకొంటాను అని అన్నారు.

    English summary
    Disney's Alladdin movie getting ready for release. For this movie Victory Venkatesh and Mega Hero Varun Tej given voice for Telugu version. In this occassion, Venkatesh and Varun Tej witty answer in Alladdin press meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X