గ్యాప్ లేకుండా వరుసగా మూడు సినిమాలు.. వెంకటేష్ స్పీడ్ మామూలుగా లేదు
దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను ఈజీగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ తోనే వెంకటేష్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ అందుతుంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసే సినిమాలను చేయాలని వెంకటేష్ కూడా అలాంటి కథలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాడు. రీమేక్ అయినా కూడా మొహమాటం లేకుండా చేసేస్తుంటాడు.
ఇక రానున్న నాలుగు నెలల్లో అందరికంటే వేగంగా సినిమాలను రిలీజ్ చేయబోతున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. ముందుగా నారప్ప సినిమాను మే 14న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే F3 సినిమాను ఆగస్ట్ 27న రిలీజ్ చేయబోతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో వరుణ్ తేజ్ మరొక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక దృశ్యం 2 రీమేక్ ను ఇటీవల స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎలాగైనా వీలైనంత తొందరగా ఫినిష్ చేసి F3 కంటే ముందే జులైలో విడుదల చేయాలని ఒక ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ విధంగా వెంకటేష్ గ్యాప్ లేకుండా వెంటవెంటనే మూడు విభిన్నమైన సినిమాలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ములతో త్వరలోనే ఒక సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











