twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్.. ఎవరితోనంటే..

    |

    Recommended Video

    Venkatesh Daugher Aashritha Wedding Date Finalized | Filmibeat Telugu

    సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత దగ్గుబాటి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. అశ్రిత పెళ్లి నిశ్చితార్థం ఇటీవల ప్రైవేట్ కార్యక్రమంగా జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి తన బాయ్‌ఫ్రెండ్‌తో అశ్రిత గత నవంబర్‌లోనే జరుగాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అశ్రిత వివాహానికి డేట్ కూడా ఫిక్స్ అయిందట. వరుడు ఎవరంటే..

    అశ్రిత దగ్గుబాటి, వినాయక్ రెడ్డి ప్రేమలో

    అశ్రిత దగ్గుబాటి, వినాయక్ రెడ్డి ప్రేమలో

    గత కొద్దికాలంగా వినాయక్ రెడ్డి అనే సంపన్నకుటుంబానికి చెందిన యువకుడితో అశ్రిత ప్రేమలో ఉన్నారు. వరంగల్ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త ఆర్ సురేందర్‌రెడ్డి మనవడే వినాయక్ రెడ్డి. హైదరాబాద్ రేస్ కోర్స్‌కు అధ్యక్షుడిగా కూడా సురేందర్ రెడ్డి సేవలందిస్తున్నారు.

    ఇరు కుటుంబాల అంగీకారంతో

    ఇరు కుటుంబాల అంగీకారంతో

    ఇరు కుటుంబాల అంగీకారం తెలుపడంతో అశ్రిత, వినాయక్ రెడ్డి పెళ్లికి లైన్ క్లియర్ అయింది. మార్చి 24వ తేదీన వీరి వివాహాన్ని జరిపించేందుకు ముహుర్తం నిర్ణయించినట్టు సమాచారం. అధికారికంగా పెళ్లి వేడుక గురించి వెల్లడించే అవకాశం లేకపోలేదు.

     నిరాడంబరంగా వివాహం

    నిరాడంబరంగా వివాహం

    అశ్రిత, వినాయక్ రెడ్డి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించాలని వెంకటేష్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెళ్లి వేడుకను జైపూర్‌లో గానీ, లేదా రామానాయుడు స్టూడియోలో గానీ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అత్యంత సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల వేడుకగా నిర్వహించాలని అనుకొంటున్నట్టు తెలిసింది.

    ఫుడ్ బిజినెస్‌లో అశ్రిత దగ్గుబాటి

    ఫుడ్ బిజినెస్‌లో అశ్రిత దగ్గుబాటి

    అశ్రిత ప్రస్తుతం ఫుడ్ బిజినెస్‌లో ఉన్నారు. పలు యాప్‌ల్లో ఫుడ్ గురించి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరులో రెస్టారెంట్లు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు అశ్రిత తన బిజినెస్, కెరీర్‌ను లో ప్రొఫైల్‌లోనే మెయింటెన్ చేయడం గమనార్హం.

    English summary
    Venkatesh Daugher Aashritha Wedding date finalised. Reports suggest that Ashrita marriage with Vinayak Reddy on March 24. Vinayak is EX MP R surender Reddy's grand son.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X