కోనసీమ నేపథ్యంలో వెంకటేష్, చైతు చిత్రం!
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రంలో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. వెంకటేష్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. చాలా రోజుల క్రితమే ప్రకటించినా ఇంత వరకు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. వెంకీ మామ అనే ఫన్నీ టైటిల్ తో రూపొందబోతున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభం కాబోతోంది.
కోనసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. వెంకీ, చైతు కోనసీమ యాసలో చేసే అల్లరి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఎఫ్2 తర్వాత వెంకీ నుంచి రాబోతున్న మరో మల్టీస్టారర్ చిత్రం ఇది. చాలా రోజులుగా అక్కినేని, దగ్గుబాటి కాంబోలో సినిమాకోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా శ్రీయ, నాగ చైతన్యకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపీలకైనట్లు తెలుస్తోంది. ఎఫ్2 చిత్రంతో చాలా రోజుల తర్వాత తనలో కామెడీ యాంగిల్ బయట పెట్టిన వెంకీ ఈ చిత్రంతో ఎలాంటి రచ్చ చేస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











