షాక్: ఆన్ లైన్‌లో 'వెంకీమామ' స్టోరీ లీక్ చేసిన పాపులర్ వెబ్‌సైట్!
నేటి రోజుల్లో సినిమాలు రూపొందించడం ఎంత సవాల్‌గా మారిందో.. ఆ సినిమాను విడుదలయ్యేదాకా లీక్ కాకుండా ఆపడం అంతే సవాల్ అవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక రూపంలో స్టోరీ లైన్ బయటపడుతూనే ఉంది. తాజాగా 'వెంకీమామ' సినిమా విషయంలోనూ అదే జరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల్లోకి పోతే..

పాపులర్ వెబ్‌సైట్.. పలు అనుమానాలు
ఓ పాపులర్ సినీ టికెట్ బుకింగ్ ఈ సినిమా స్టోరీ లీక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంటే.. సడెన్‌గా ఇలా స్టోరీ లైన్ లీక్ చేయడం హాట్ టాపిక్ అయింది. పైగా ఈ స్టోరీ లైన్ పెట్టింది ప్రముఖ సినీ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ కావడం అనుమానాలకు తావిస్తోంది.

స్టోరీ లీక్.. ఇదీ అసలు మ్యాటర్
''చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన నాగ చైతన్య బాధ్యతలను మేనమామ అయిన వెంకీ తీసుకుంటాడు. కానీ వెంకీ నాన్న ఒక జోతిష్యున్ని అడగ్గా ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయం.. పెరిగి పెద్దయ్యాక ఎప్పటికైనా మేనమామ ప్రాణం మేనల్లుడు చేతిలోనే పోతుంది అని. అది తెలిసి కూడా మేనమామ వెంకీ ఎంతో ప్రేమతో మేనల్లుడిని పెంచుతాడు" అనేది ఈ సినిమా స్టోరీ అని అంతా లీక్ చేయడం జరిగింది.

ప్రీ రిలీజ్ బిజినెస్.. ప్రపంచవ్యాప్తంగా
ఇక ‘వెంకీమామ' నుంచి వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. లేటెస్ట్ సమాచారం మేరకు వెంకీమామ సీడెడ్ హక్కులు 5.4 కోట్లకి అమ్ముడయ్యాయని, అదేవిధంగా ఆంధ్ర ఏరియాలో 17 కోట్ల మేర బిజినెస్ జరిగిందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా 37 నుంచి 40 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్.

వెంకీమామ మూవీ
బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ' సినిమాను వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











