నారప్ప రిలీజ్ పై మరో క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. ఇప్పట్లో లేనట్లే..
టాలీవుడ్ లో వరుసగా మళ్ళీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఒక దాని తరువాత మరొకటి గ్యాప్ లేకుండా వాయిదా పడుతున్నాయి. విక్టరీ వెంకటేష్ నటించిన తమిళ్ రీమేక్ మూవీ నారప్ప కూడా విడుదల తేదీన వాయిదా వేసుకోక తప్పలేదు. గత కొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి.
మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. ఇక మే 14న విడుదల చేయడానికి సిద్దమవుతున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది. సినిమా థియేటర్లు క్లోజ్ అవ్వడంతోనే సినిమా వాయిదా పడినట్లు ఒక టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఫైనల్ గా చిత్ర యూనిట్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఉన్న కఠిన పరిస్థితులలో సినిమాను విడుదల చేయడం వీలు కాదని మళ్ళీ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే న్యూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తామని అన్నారు. ఇక దృశ్యం 2 షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది. ఆ సినిమాను ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేయనున్నట్లు వస్తున్న విషయంలో ఎలాంటి నిజం లేదని కూడా నిర్మాత సురేష్ బాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











