అనంతపురంలో ‘నారప్ప’.. ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్
ఎఫ్2, వెంకీమామ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం 'నారప్ప' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.మొదటి సన్నివేశాన్ని విక్టరీ వెంకటేష్‌పై చిత్రీకరించారు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం టైటిల్‌ని రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. 'నారప్ప' గెటప్‌లో విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు విక్టరీ వెంకటేష్. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్.కె నాయుడు సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తుండగా.. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











