F3 తరువాత వెంకీ కొత్త సినిమా అతనితోనే..
టాలీవుడ్ బెస్ట్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ అంటే అన్ని వర్గాల ఆడియెన్స్ ఇష్టపడతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇక నెక్స్ట్ నారప్ప సినిమాతో రానున్న వెంకీ ఆ తరువాత F3 సినిమాతో నవ్వించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి
అయితే F3 లాంటి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ తరువాత వెంకటేష్ ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. వీలైనంత వరకు స్లోగానే వెళ్లాలని అనుకుంటున్న వెంకటేష్ F3 పనులు సగం అయిపోతే ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే మరో సినిమా రానుందట. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమాకు కమిటైన విషయం తెలిసిందే.

అయితే దర్శకుడు ఇంకా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయలేదు. ముందుగా వీరి కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా వస్తుందని టాక్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ లో అనుమానాలు ఉండడం వల్లే వెనక్కి తగ్గినట్లు తరుణ్ కూడా చెప్పాడు. ఇక ఫైనల్ గా దర్శకుడు మరో కొత్త కథకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి అనంతరం వెంకీ - తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ పై ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఆ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











