వెంకటేష్ నెక్స్ట్ మూవీ.. అసురన్ రీమేక్ రెగ్యులర్ షూట్ షెడ్యూల్ ఫిక్స్
ధనుష్ హీరోగా తెరకెక్కి తమళనాట సంచలనం సృష్టించిన 'అసురన్' సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందించాలని ఫిక్స్ అయ్యారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఓ సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకున్న సురేష్ బాబు.. శ్రీయ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ కోసం రామానాయుడు స్టూడియోలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభంలోనే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేశారట. అదేవిధంగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అతిత్వరలో అన్ని విశేషాలు తెలపనున్నారు.
ఇకపోతే వెంకటేష్ తాజా చిత్రం 'వెంకీమామ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లోను వసూళ్ల పరంగా తన దూకుడును కొనసాగిస్తోంది వెంకీమామ సినిమా. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్.. అదే జోష్‌లో 'అసురన్' రీమేక్ సెట్స్ పైకి రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











