ఎందుకు మగవాళ్లు గొంత్తెత్తడం లేదు? దిశా ఘటనపై వెంకటేష్ రియాక్షన్

హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా షాద్‌నగర్ హత్య ఘటనపైనే చర్చలు నడుస్తున్నాయి. ఈ దారుణమైన దుర్ఘటనను పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు దేశ ప్రజలంతా. జస్టిస్ ఫర్ దిశా అంటూ దేశమంతా గళమెత్తింది.

ఇప్పటికే ఈ దుర్ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే. అంత్యంత పాశవికంగా హత్యాచారం చేసి హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజగా ఈ అంశంపై విక్టరీ వెంకటేష్ రియాక్ట్ అవుతూ తన సందేశం తెలిపారు.

 Venkatesh Reaction On Disha Murder Case

రేప్ అండ్ మర్డర్ అనేది ఒక్క ఆడవాళ్ల అంశమే కాదు.. ఎందుకు మగవాళ్లు, అబ్బాయిలు దీని గురించి మాట్లాడటానికి ముందుకు రావడం లేదు? ఎందుకు నిరసన తెలపడం లేదు? ఎందుకు గొంత్తెత్తడం లేదు? అని ప్రశ్నించారు వెంకటేష్. ''అమ్మాయిలంటే వస్తువులు కాదు నీ సొంతం అనుకోడానికి.. గౌరవం, స్వేచ్ఛ వాళ్ల హక్కు అని గుర్తించుకోవాలి. అబ్బాయిలకు చెప్పండి బాధ్యతగా నడుచుకోమని.. సత్ప్రవర్తన నేర్చుకోమనండి.. అంతా జరిగిపోయిన తర్వాత రియాక్షన్ కాదు యాక్షన్ కావాలి'' అని వెంకటేష్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం వెంకటేష్ తన అల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై వెంకీ, నాగచైతన్య అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు. చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X