twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దృశ్యం 2’కు హిట్ టాక్.. రీమేక్’కు వెంకీమామ రెడీ

    |

    ప్రస్తుతం దృశ్యం 2 సినిమాపై వస్తోన్న కామెంట్లు, రివ్యూలు అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోహన్ లాల్, జీతూ జోసెఫ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దృశ్యం సీక్వెల్ అంటూ మొదలుపెట్టడంతోనే అంచనాలు ఆకాశన్నంటాయి. అలా వాటికి తగ్గట్టే ఈ సీక్వెల్ ఉండటంతో అందరూ సంతృప్తి చెందారు. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

    అయితే ఇలా హిట్ టాక్ వచ్చిందో లేదా అలా రీమేక్‌లు కూడా రెడీ అయిపోయాయి. తమిళంలో కమల్ హాసన్, తెలుగు వెంకటేష్ ఈ సీక్వెల్‌కు రీమేక్ చేసేందుకు సిద్దమయ్యారు. తాజాగా వెంకటేష్ తన టీంతో కలిసి దృశ్యం 2 సినిమా రీమేక్ గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో దృశ్యం టీం ఉంది. వారితో పాటు సురేష్ బాబు కూడా ఉన్నాడు.

    Venkatesh Ready To Do Remake Drishyam 2 Movie

    అయితే ఈ రీమేక్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయం మాత్రం ప్రకటించలేదు. మొదటి పార్ట్‌లో సినిమా ఎక్కడైతే ముగిసిందో.. సీక్వెల్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. సీక్వెల్ మొత్తం శవం చుట్టూ, దాన్ని దాచిపెట్టిన చోటు చుట్టే తిరుగుతుంది. అయితే చివర్లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తుంది. చివరి ముప్పై నిమిషాలే సినిమాను యూటర్న్ తిప్పేశాయి. మొత్తానికి తెలుగులో కూడా ఈ రీమేక్ మ్యాజిక్ చేయనుండటం ఖాయం.

    English summary
    Venkatesh Ready To Do Remake Drishyam 2 Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X